ఈనాడు కథలపోటీ – బహుమతులు : 1.70 లక్షలు

 ఈనాడు కథలపోటీ –  బహుమతులు : 1.70 లక్షలు

తెలుగు కథా రచయితలను, సాహిత్యాన్ని ప్రోత్సహించడం కోసం ఈనాడు,

రామోజీ ఫౌండేషన్ ‘కథా విజయం – 2020′ పోటీకి రచనలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే భారీ వర్షాలు, వరదలతో తెలుగునాట వివిధ ప్రాంతాలు అతలాకుతలం అయినందున పోటీకి తుది గడువును పెంచమని చాలా మంది రచయితలు కోరుతున్నారు. అంతర్జాలం ద్వారా కథలను సమర్పించడం సాంకేతికంగా కష్టంగా ఉందని సీనియర్ రచయితలు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కథా విజయం – 2020’ పోటీకి రచనలు పంపడానికి తుది గడువును డిసెంబరు 31 దాకా పొడిగిస్తున్నట్టు, పోస్టు ద్వారా కూడా కథలను స్వీకరించనున్నట్లు రామోజీ ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

రచయితలు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు… • పోటీకి పంపే కథల్లో తెలుగు నుడికారం ఉట్టిపడాలి. * తెలుగు వారి జీవితాల్ని, ఆలోచనల్ని, భావోద్వేగాల్నీ ప్రస్ఫుటించాలి. * ఏ మాండలికంలో అయినా రాయవచ్చు. • వస్తువు అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా ఉండాలి. * కథ పాఠకుల మీద గాఢమైన ముద్రవేయాలి. • కులం, మతం, ప్రాంతం, స్త్రీలు, వైకల్యాలను కించపరిచే పదజాలం, భావాలు ఉండకూడదు. • అనవసర విషయాలు, సాగదీత లేకుండా చూసుకోవాలి. * కథ 2500 పదాలకు మించకూడదు. * కథ మీద రచయిత పేరు, వివరాలు ఉండకూడదు. * నిర్దేశిత అంగీకార పత్రాన్ని కథకు జోడించాలి. ఆ కథలను ‘కథావిజయం – 2020,

రామోజీ ఫౌండేషన్, రామోజీ ఫిల్మ్ సిటీ, అబ్దుల్లాపూర్‌మెట్ (మం), రంగారెడ్డి జిల్లా, తెలంగాణ- 501512 చిరునామాకు, డిసెంబరు 31లోగా అందేలా పోస్టు చేయవచ్చు.

పోటీల పూర్తి వివరాలు, అంగీకారపత్రం నమూనాలను teluguvelugu.in వెబ్ సైటులో చూడవచ్చు.

31 మంది విజేతలు.. 1.70 లక్షల బహుమతులు

ప్రథమ : ఒక అత్యుత్తమ కథకు: రూ. 25,000

ద్వితీయ : 2 ఉత్తమ కథలకు రూ.15 వేల చొప్పున

తృతీయ : రూ.10 వేల చొప్పున 3

ప్రత్యేకం : రూ.5 వేల చొప్పున

5 ప్రోత్సాహక : రూ.3 వేల చొప్పున 20

తుది గడువు : డిసెంబరు 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//ugroocuw.net/4/2863274