యూనిట్ ని కుటుంబంగా చూసుకున్న నిర్మాత

 యూనిట్ ని కుటుంబంగా చూసుకున్న నిర్మాత

సినిమాని ఓ మహాయజ్ఞంలా భావించే నిర్మాతల్లో వి.రవిచంద్రన్ ఒకరు. ఆయన మంచి నటుడు. రచయిత, దర్శకుడు, నిర్మాత 1987లో ప్రేమ యుద్ధం అనే చిత్రం షూటింగ్ లో హీరో నాగార్జున, కన్నడ వెర్షన్ హీరో రవిచంద్రన్ నాకు పరిచయం అయ్యారు. బెంగళూరులో 3 ఏళ్ళు సాగిన ఆ ప్రేమ యుద్ధం చిత్రం షూటింగ్ సమయంలోనే రవిచంద్రన్ నన్ను తన వెంట తన ఆఫీస్ ఈశ్వరి ఫిలింస్ కి తీసుకెళ్ళారు. వాళ్ళ వాన్నగారు వీరస్వామి గొప్ప మనసున్న వ్యక్తి అభిరుచిగల నిర్మాత, వ్యాపార రహస్యాలు తెలిసిన డిస్ట్రిబ్యూటర్, రవిచంద్రన్ తండ్రిలోని మంచితనం పుణికి పుచ్చుకున్నారు. రాజ్ కపూర్, యాష్ చోప్రా రవికి ఆదర్శం. పంసలేఖ ఆయనకి కేవలం రచయిత, సంగీత దర్శకుడే కాదు మంచి ఫ్రెండ్. రవిచంద్రన్ ప్రేమలోక అనే సినిమా కన్నడంలో తీశారు. 365 రోజులు ఆడింది. సూపర్ డూపర్ హిట్టు. తెలుగులో కూడా ప్రేమలోకంగా అది 100 రోజులు డబ్బంగ్ వెర్షన్ ఆడింది. ఆ తర్వాత రణధీర అనే చిత్రం సూపర్ డూపర్ హిట్టు, ఆ తర్వాత శాంతి క్రాంతికి శ్రీకారం చుట్టారు. ప్రేమ యుద్ధం షూటింగ్ లో నాగార్జున యాక్టింగ్ బాగా నచ్చడంతో రవిచంద్రన్ శాంతి క్రాంతికి హీరోగా నాగార్జుననే ఎన్నుకున్నారు. తమిళ వెర్షన్ కి రజనీకాంత్ ని ఒప్పుంచారు. అలా తెలుగు, తమిళం కన్నడతో పాటు హిందీలో కూడా శాంతి క్రాంతి నిర్మించాలని రవిచంద్రన్ నిర్ణయించుకున్నారు. జూహీచావ్లా, కుష్ బూ ఇద్దరూ ఆ చిత్రంలో కథానాయికలు. భారీగా ఖర్చు పెట్టడం, భారీగా ఆలోచించడం పెద్ద పెద్ద సెట్స్ వేయాలని నిర్ణయించుకోడు. రవిచంద్రన్ ప్రత్యేకత దర్శకులందరికీ ఆదర్శం, మీరు ఆ శాంతి క్రాంతి టైటిల్స్ చూడండి. ఓ 1500 మంది యూనిఫారంలో ఉన్న విద్యార్థులని 20 బస్సులలో తీసుకొచ్చి ప్రతిరోజు 4 గంటలు పనిచేయించేవారు. ఆ షాట్స్ లో నిర్మాత వి.

రామస్వామి పేరు. ఈశ్వరి ఫిలింస్ పేరు శాంతి క్రాంతి అనే ఇంగ్లీష్ బైరల్ దర్శకుడి పేరు అప్పుల్లోనే త్రివర్ణ పతాకంతో సహా ఓ 60 రోజుల పాటు షూటింగ్ చేస్తానే ఉన్నారు. ఆయన ఓ కేక్ తో వేసిన డబుల్ కాట్ సెట్ టవల్ తయారు చేయించడం, ఆ కధానాయిక పుట్టినరోజు కార్యక్రమాన్ని చిత్రంలో చూపించిన తీరు రవిగారి ఉహలకు భారీతనానికి నిదర్శనం. ఆ చిత్రంలో అనంత్ నాగ్ విలన్ గా నటించారు. షూటింగ్ ప్రారంభం రోజునే రవిచంద్రన్ – భారతదేశంలో ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ప్రెస్ వాళ్ళని 3 రోజులు గెస్టులుగా బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటల్స్ లో బస చేయించి హాలిడే ఇన్ హోటల్ లో ప్రతిరోజు ఒక చిత్రం. కాక్ టైల్ డిన్నర్ ఏర్పాటు చేసేవారు. అలా మూడు రోజలలో మొదటి రోజు ప్రేమలోక రెండో రోజు రణధీర, మూడో రోజు శాంతిక్రాంతి ముహూర్తం వైభవానికి మరో పేరు. ఆ ముహూర్తంలో ఖర్చు నదిలా ప్రవహించింది. ఓ మైలురాయిలా ఘనంగా ప్రారంభం అనే పదానికి అర్థంలా విలవింది. ఒక సన్నివేశంలో హీరో లాకప్ లో ఉంటారు. లాకప్ లో ఉన్న నాగార్జున తన కథానాయికని తలుచుకుంటూ ఉంటారు. ఆ లాకప్ తలుపు తీసి ఓ ఎస్పై రావడం గమనించడు. అందుకు ఆ ఎస్పై ఓ మగ్గుతో నీళ్ళు తీసి ఏదో ఆలోచిస్తున్న నాగార్జున మొహాన కొడతాడు. జహీచావ్లా గురించి ఆలోచనలో ఉన్న నాగార్జున మొహాన వీళ్ళు కొట్టగానే ఉలిక్కి పడతాడు. కళ్ళు తెరుస్తారు – అదే సింగిల్ షాట్ దీన్న రవిచంద్రన్ చిత్రీకరించడంలో గమ్మత్తయిన టెక్నిక్ వాడారు. జూహీచావ్లాని కెమెరా వెనక నిలబడమని కెమెరామెన్ మధుని ఆ అమ్మాయి ప్రతిబింబాన్ని అద్దంలో క్యాచ్ చేయమని, జూహీచావ్లాని తల పైన జుట్టు షో మోషన్లో ఎగరేస్తూ అద్దంలో కన్పిస్తూ, ఆమె నవ్వుతూ క్లోజ్ అప్ లో కన్పించగానే ఆ అద్దాన్ని ఓ లారీతో బద్దలు కొట్టాలి.

ఎదురుగా నాగార్జున ఆమె గురించి ఆలోచిస్తూ ఉండగా ప్రతిబింబం బద్దలు అయి నీళ్ళు చల్లగానే నాగార్జున మొహం పైన లాఠీ దెబ్బ పడుతుంది. ఆయన దిగ్ర్భాంతికి గురవుతాడు. ఈ షాట్ తీయడానికి నిర్ణయించి నాగార్జునతో ప్రారంభోత్సవం ఓపెనింగ్ ముహూర్తం షాట్లో 14 అద్దాలు బద్దలవడం విశేషం. ఇంత భారీ ఖర్చు అప్పటి నుంచి ఇప్పటి దాకా నిజంగా ఓ రికార్డు. రవిచంద్రన్ కి సంగీతం పట్ల చాలా శ్రద్ధ, ఆసక్తి, ప్రవేశం కూడా ఉన్నాయి. పాట ట్యూన్ చేయడంలో హంసలేఖతో కలిసి ఆయన పడే తాపత్రయం మరిచిపోలేనిది. ఆపాటను చేయించు కోవడానికి వేటూరి, వెన్నెలకంటి లాంటి వాళ్ళతో ఆయన చూపిన శ్రద్ధ అద్భుతం. అలాగే ఆయన ప్రతినెలా దాదాపు ఓ వారం రోజుల నుంచి 10 రోజులు రెండు సంవత్సరాల పాటు తెలుగు రచయితగా నన్ను పిలిపించేవారు. అలాగనే మేము ముగ్గురం దాదాపు రెండు సంవ్సరాల విమానంలో రావడం పోవడం. హోటల్స్ ఉన్న ప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో కారు, రాగానే రైటర్స్ కి ఖర్చుల కోసం ఆరోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పించేవారు. కారు, పదివేల రూపాయలు క్యాష్ ఉన్న కవర్, ఫ్లయిటు దిగగానే వాళ్ళ మేబర్ బాబు అందించేవారు. అలా వీరస్వామి నిర్మాతగా మా రచయితలనే కాదు. ప్రతి టెక్నీషియన్ ని తన కుటుంబ సభ్యుడిగా చూసుకునేవారు. నిజంగా రవిచంద్రన్ కలకాలం అతని కలలు నిజం చేసుకుంటూనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//ugroocuw.net/4/2863274