మదనపల్లె ను జిల్లాగా ప్రకటించాలి

 మదనపల్లె ను జిల్లాగా ప్రకటించాలి

531రోజులుగా శాంతియుతంగా ఉద్యమం, ఈనెల 26 నుండి ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం * పెద్దమనుషుల సమావేశం తీర్మానాలను ప్రకటించిన మదనపల్లె జిల్లా సాధన సమితి *27-11-2020 న పుంగనూరు లో భారీ ఎత్తున సమావేశం. ఈనెల 26 “భారత రాజ్యాంగ ఆమోద దినం” లోగా మదనపల్లె జిల్లా ఆమోదిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని లేనిపక్షంలో, “రాజ్యాంగ ఆమోద దినం” రోజున మదనపల్లె జిల్లా ఆమోదం కోరుతూ ఆందోళనలు ఉదృతం చేస్తామని, మదనపల్లె జిల్లా సాధన సమితి కో కన్వీనర్ శ్రీ చందు, కో కన్వీనర్లు ఉత్తన్న, శ్రీనివాసులు గంగరాజులు, ప్రకటించారు. శ్రీబాగ్ ఒప్పంద దినాన్ని పురస్కరించుకొని మదనపల్లెలో 16-11-2020న “పెద్దమనుషులు సమావేశం” జరిగింది. పెద్దమనుషుల సమావేశం తీర్మానాలను, మదనపల్లె జిల్లా సాధన సమితి నేతలు ప్రకటించారు. అందులో భాగంగా ఈరోజు పుంగనూరు లోని చారిత్రాత్మక కట్టడం నగిరి రాణి మహల్ దగ్గర దశాబ్దాల కల మదనపల్లి జిల్లా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈసందర్బంగా నేతలు మాట్లాడుతూ మదనపల్లె జిల్లా ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమం, నేటికి 531 వ రోజుకు చేరిందని, అయినా ఇక్కడి ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 26 లోగా ఇక్కడి ప్రజాప్రతినిధులు మదనపల్లె జిల్లాపై స్పందించాలని పెద్దమనుషుల సమావేశం కోరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటుపై నియమించిన కమిటీలు కూడా మదనపల్లె జిల్లాపై స్పష్టత ఇవ్వాలని పెద్దమనుషుల సమావేశం అభిప్రాయపడిందని తెలిపారు. కొత్త జిల్లాల జాబితాలో “మదనపల్లె జిల్లా” కు చోటు కల్పించాలని, లేకుంటే మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలను చిత్తూరు జిల్లాలోనే కొనసాగించాలని, అదీ చేతకాకపోతే ఈ ప్రాంతాన్ని కర్ణాటకలో కలిపేయాలని పెద్దమనుషుల సమావేశం డిమాండ్ చేసిందన్నారు. “పెద్దమనుషుల సమావేశం” చేసిన డిమాండ్లపై నిర్లక్ష్యం వహిస్తే, ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. పెద్దమనుషుల సమావేశం రూపొందించిన కార్యాచరణలో భాగంగా “నవంబర్ 26 రాజ్యాంగ ఆమోద దినం” నాడు మదనపల్లె జిల్లాకు ప్రభుత్వ ఆమోదం కోరుతూ ఆందోళన ఉదృతం చేస్తున్నామని, అన్ని రాజకీయ పక్షాలు, సంఘాలు, సంస్థలు, మేధావులు, కవులు, కళాకారులూ స్వచ్చందగా ఉద్యమంలో పాల్గొని, మదనపల్లె జిల్లా సాధన ఉద్యమాన్ని ఉదృతం చేయాలని వీరు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో…. లాయర్ అసోసియేషన్ శ్రీనివాసులు గారు. ఎమ్మార్పీఎస్ నరసింహులు, వి ఆర్ పి ఎస్ గంపల గంగరాజు. కాంగ్రెస్ నాయకులు సజ్జాద్, బీసీ సంఘం నాయకులు కృష్ణమూర్తి, మైనార్టీ నాయకులు బాబు సాహెబ్, మహిళా నాయకురాలు విజయదుర్గా గారు, బిజెపి నాయకులు అయూబ్, తో పాటు మరికొందరు జిల్లాను కాంక్షించే వారు పాల్గొన్నారు.. జై మదనపల్లి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//stawhoph.com/4/2863274