‘మనం ఫౌండేషన్’ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తిని గౌరవ డాక్టరేట్ వరించింది

 ‘మనం ఫౌండేషన్’ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తిని గౌరవ డాక్టరేట్ వరించింది

మానవ సేవే మాధవ సేవ అని గట్టిగానమ్మి గత రెండు దశాబ్దాలకు పైగా సమాజ సేవలో పునీతమైన ‘మనం ఫౌండేషన్’ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తిని గౌరవ డాక్టరేట్ వరించింది.

సామాజిక, సేవా రంగాలలో ఆయన సేవలను గుర్తించిన UNITED NOBLE RESCUE SERVICES సంస్థ సమాజ సేవలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా మనం ఫౌండేషన్ అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బ్బందువులు చక్రవర్తికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

చక్రవర్తి గారి సేవా కార్యక్రమాల వివరాలు… జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమలకు పరిమితం చేస్తున్న నేటి సమాజంలో సమాజసేవే తన జీవిత ఆశయమని సమాజ సేవ

కోసం నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

2018వ సంవత్సరంలో స్థాపించిన ‘మనం ఫౌండేషన్’ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటివరకు 25 అవార్డులు, రివార్డులు అందుకున్నారు. కడప జిల్లా పొద్దుటూరు పట్టణానికి చెందిన న్యాయవాది, మనం ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీ కె చక్రవర్తి.

నిరుపేద కుటుంబంలో ప్రొద్దుటూరులో జన్మించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా, యాడికి మండలంలో ఇంటర్ వరకు చదువుకున్నారు. తరువాత అమ్మమ్మ గారి ఊరు నాకు జన్మనిచ్చన గడ్డ ప్రొద్దుటూరులో స్థిరపడి జీవనం సాగిస్తున్నారు. తండ్రిగారు కె. పెద్దరాజు పోస్ట్ మ్యాన్ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అనేక కష్టనష్టాలు ఓర్చి వీరికి చదివించారు.

ఉన్న దాంట్లో కొద్దిగా పేద ప్రజలకు సహాయం చెయ్యమని తన తండ్రిగారు చెప్పారు. తండ్రి గారి ఆశయం మేరకు ‘మనం ఫౌండేషన్’ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

భయంకరమైన మందులేని ఎయిడ్స్ వ్యాధి, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, నిరక్షరాస్యత నిర్మూలన, బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు మరియు చికెన్ గునియా, డెంగ్యూ, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజేయడం వంటి చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రతి సంవత్సరం వెయ్యి మంది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పుస్తకాలు, పలకలు మెటీరియల్ పంపిణీ, అనాథ వృద్దులకు అన్నదానం, గోదానం చేయడం, ఆటో డ్రైవర్లను ఆదుకోవడం చేస్తున్నారు.

కరోనా కాలంలో వలసకూలీలకు అన్నదానం, కూరగాయలు పంపిణీ, కరోనా యోధులకు అవార్డులు ఇచ్చారు. ఆయన సేవలను గుర్తించిన ఇతర రాష్ట్రాల, దేశాల పలు సంస్థలు సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశాయి. సమాజ సేవే జీవిత ఆశయంగా మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి కొనసాగుతున్నారు.

పెదనాన్న పెద్దరాజు గారు మరియు తన తండ్రిగారు కీ|| శే|| కె.రామన్న రిటైడ్ క్రాఫ్ట్ టీచర్ గారి ఆశయాలను కొనసాగిస్తున్నారు. ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ మదర్ తెరిసా ఆశయంతో .. ‘మీ విజయానికి నువ్వే కదా నీ పట్నానికి నువ్వే కర్త’ అన్న వివేకానందస్వామి స్పూర్తితో.. “నీ

కోసం పనిచేస్తే నీతోనే ఉంటా – ప్రజల కోసం పనిచేస్తే ప్రజల హృదయంలో ఉంటావు’ అన్న అంబేద్కర్ వాక్కులను ఆదర్శంగా తీసుకొని.. ‘వట్టిమాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్’ అన్న మహాకవి గురజాడ అప్పారావు గారి స్పూర్తితో… ప్రతి ఒక్కరు సమాజ సేవ చేయాలని ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి

డిగ్రీ స్థాయి వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని శ్రీ చక్రవర్తి ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు. చక్రవర్తి గారి తల్లిదండ్రుల ఆశయాలు ‘మనం ఫౌండేషన్’ ద్వారా దాతల సహకారంతో విస్తృతం కావాలని ఆశిస్తూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//oagnatch.com/4/2863274