నిత్యసేవాదురంధరులు-జె.యస్.యస్.బ్రహ్మానందాచారి

 నిత్యసేవాదురంధరులు-జె.యస్.యస్.బ్రహ్మానందాచారి

“ఆ.వె. దేశమేమిచేసె దీన జనులకని

నింద జేయు వారు నేడు మెండు

 చేతనైన సాయ మింత చేయరుగాని 

తెలిసి మసలు కొనుము తెలుగు బిడ్డ.

అని డాక్టర్ బెజ్జంకి “తెలుగు బిడ్డ”నీతి శతకము లో అన్నట్లు, ప్రతివారూ దేశాన్ని విమర్శించేవారే. తన స్తోమతకు తగి సహాయ సహకారం మాత్రం చేయడు

ఈనాటి సగటు పౌరుడు. కొందరు కోటాను కోట్లకు తీరిన వారున్నారు. ఆగర్భ శ్రీమంతులు,నడమంత్రపు శ్రీమంతులు. వీరంతా పాపభీతి తోనో లేక ఆడంబరానికో గాని లక్షలు లక్షలు పెట్టి వజ్రాల హారాలు, కిరీటాలు చేయించి తీసుకొని వెళ్ళి దేవుని కి సమర్పించుకుంటారు. కాని గుడిమెట్ల ముందున్న బిచ్చగాడి సత్తు బొచ్చెలో చిల్లి కాణీ వేయరు. ఇక మధ్యతరగతివారు కొందరున్నారు ,

సుష్టుగా బొజ్జ నిండా భోజనం చేసి పండుకొని విసన కర్రతో బొజ్జకు విసురుకుంటూ”చిన్నారి నా పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ కాలం వెళ్ళదీస్తారు. ఆపదలో ఉన్న తోటివారికి సాయంచేయరు. ఇది నేడు జరుగుతున్న పరిస్థితులు.కనుకనే ధర్మదేవత ఒంటి కాలుమిద నడుస్తోంది.

కృతయుగంలో ధర్మదేవత నాలుపాదలమీద నున్నది, త్రేతాయుగంలో మూడుపాదలమీద,ద్వాపర యుగంలో రెండు పాదాలమీద ఉన్నది .మరి కలియుగంలో ఒకే పాదం ఉన్నది,అంటే అధర్మం మూడు పాదాలమీద నడుస్తోంది. కనుకనే ఎటుచూచినా అధర్మం రాజ్యమేలుతోంది.

జాలి దయ లేదు పాపభీతి లేదు. ధర్మం ఒక్క పాదం మీద నిలబడింది. అదీ ఎలా అనుకున్నారు. కొందరు మహనీయులు, దయాపరులు జాలిగుండె కలవారు మానవత్వం కలవారు దేశంలో ఉండబట్టి కొంచె ధర్మం ఆ ఒక్క కాలిమీదైనా నిలబడింది. అనుట అక్షరసత్యం.

రామకృష్ణ సేవాసమితి, రెడ్ క్రాస్ సొసైటి,రోటరీ క్లబ్, లైన్స్ క్లబ్ మొదలగు అతి పెద్ద స్వచ్ఛంద సేవాసంస్థలు సేవలందిస్తున్నాయి. కరువు కాటకాలు వచ్చినప్పుడు బడుగులు బలహీనులు ఆపదలనుండి గట్టెక్కిస్తున్నారు. అటువంటి సేవా తత్పరుల కోవకు చెందినదే

మన “జె.కె.ఆర్. వెల్ఫేర్ సొసైటీ” వ్యవస్థాపకులు బ్రహ్మానందాచార్యులుగారి వయసు చిన్నదైనా వ్యాసంగం పెద్దది. మనసు పెద్దది,మానవత్వం ఉన్నది.

సేవకే అంకితమై, సేవే పరమావధిగా నడుచుకుంటున్నారు. వృద్ధ తల్లిదండ్రులను అనాధ శరణాలయాలకు పంపి బాధ్యతలనుండి తప్పుకుంటున్నారు. బ్రహ్మానందాచారిగారు జన్మనిచ్చిన తండ్రిని మరువకుండా నిత్యం స్మరించుకుంటూ పదిమందికి తెలియజేసే విధంగా తండ్రిగారి పేరున సేవాసంస్థను నెలకొల్పి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. తల్లిగారి మాటను గౌరవిస్తూ వారి అనుమతితో సేవాకార్యమాలు చేయటం ప్రశంస నీయం. ధర్మం ఒంటికాలుమీదైన ఉన్నది అంటే అది బ్రహ్మానందాచారి గారి లాటి సేవాత్పరుల వలననే అనేది

కాటం

నిర్వివాదాంశం.

వీరు సేవాకార్యక్రమాలు వారి శక్తి కి మించి చేస్తున్నారు. దానకి తోడు మేమున్నాం మీకండగా అని ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారు. ప్రతియేటా దాదాపు 3వేలమంది బాలబాలికలకు చదువుకు కావలసిన పుస్తకాలు, కలాలు, వస్తువులు ఉచితంగా పంచటం ఎంతో గొప్ప విషయం. భావి భారత పౌరులు బడుగు బలహీనులైన విద్యార్థినీ విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా వారు అసౌకర్యానికి గురికాకుండా చక్కగా చదువుకోటానికి సహకరిస్తూ చదువుల తల్లి సేవ లో పునీతులౌతున్నారు.

రాయలసీమ రాళ్ళసీమ కాదు ఒకనాడు రత్నాల సీమ ఇప్పడు విద్యారత్నాలతో వెలుగొందాలని బ్రహానందాచారి గారి ఆశయంగా కనబడుతోంది అందుకే వారు వారి సేవాకార్యక్రమాలలో బడిపిల్లలకు పెద్దపీట వేశారు. వారికి ఆరోగ్యపరీక్షలు చేసే క్యాంపులు నిర్వహించటం,కళ్ళకు జోళ్ళు,కాళ్ళకు చెప్పులు ఇప్పించటం ప్రతియేటా చేస్తున్నారు. అంతటితో ఊరుకోలేదు. వారికి మద్యాహ్నభోజనానికి కావలసిన ప్లేట్లు, గ్లాసులు సమృద్ధిగా సమకూర్చటం ఒక యజ్ఞం లాచేస్తున్నారు బ్రహ్మానందాచారిగారు.

అంతేకాదండి విద్యా వ్యాప్తి పట్ల ఎంతమక్కవో వారికి బాలకార్మికులను,బడి ఈడు పిల్లలను బళ్ళో చేర్పిస్తున్నారు.

అంతటితో ఊరుకోరు మధ్యపాన ధూమపాననిషేదం వంటి ప్రభోధాత్మక కార్యక్రమాలు మరియూ ర్యాగింగ్ నిరోధక ర్యాలీలు చేయటంతో పాటు తత్సంబంధిత అంశాలపై పత్రికలకు వ్యాసాలు రాయటం చేస్తున్నారు. పుస్తకాలకు ముందుమాటలు రాయటం సభలలో సమన్వయకర్తగా వ్యవహరించడం కూడా చేస్తున్నారు.

పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో అందరూ మొక్కలు నాటి పేపర్లకు ఫోటోలు దిగి చేతులు దులుపుకుంటారు, కాని ఆచారిగారు అలాగాదు దాదాపు రెండువేల మొక్కలు నాటి 500మొక్కలు పెంచి పోషించి పెద్దచేశారట. ఇది వారిలో ప్రత్యేకత.

2012ల వారి గ్రామ పరిసర ప్రాంతాలలో మలేరియా విజృంభించి కరాళ నృత్యం చేస్తూ ఎంతో మందిని కబళిస్తున్న తరుణంలో ధైర్యంగా వారి మధ్యలోకు వెళ్ళి ఉచిత సేవలు చేశారు. ఇప్పటికీ ఆగ్రామస్తులు ఆవిషయాలు గుర్తు చేసుకుంటూ మా దేవుడయ్య అని చెప్పుకుంటూ సంబరపడుతున్నారు.

ఇంకనూ మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలు, వృద్ధులకు అనాదలకు దుప్పట్లు పంచటం ఒకటేమిటి ఇదిచేస్తున్నారు ఇదిచేయటం లేదు అని సందేహమే లేదు. ఎన్నేన్ని సేవాకార్యక్రమాలు ఉన్నాయో అన్నీ చేస్తున్నారు.

కనుకనే ప్రముఖ దినపత్రికలు బ్రహ్మానందాచారి గారి గురించి పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించిన సంగతి లోకవిదితమే.

పలు సేవాసంస్థలు వీరి సేవలు గుర్తించి ఘన సన్మానాలు సత్కారాలతో ముంచెత్తాయి. కొన్ని వందల సన్మానాలు చేశారు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రమంత్రులు, స్పీకర్లు, పీఠాధిపతులచేతులమీదుగా సన్మానాలు అందుకొన్నారు అనుట అతిశయోక్తి కాదు నిన్నగాక మొన్న “ధర్మకేతనం సాహిత్య కళాపీఠం” హైదరాబాద్ వారు “సేవాస్పూర్తి దాత” బిరుదునిచ్చి గౌరవించారు.

తన తండ్రి గారి పేరున సేవాకార్యక్రమాలలో నిమగ్నమయ్యుండి గూడా ,వాటికితోడుగా పలుసంఘాలలో మైనారిటీ సంఘాలకు,వినియోగదారుల సంఘాలలో, విశ్వబ్రాహ్మణ సోదర సంఘాలలోను,మరికొన్ని సాహితీ సం స్థలలో తనవంతు సేవలు అందిస్తున్నారు. ఇటువంటి సేవలు, ఇంతటి నాయకత్వ లక్షణాలు వారి తండ్రిగారి ద్వార సంక్రమించినవి. వారినాన్నగారు కీశే. జె.కె.రామచంద్రయ్యగారు కుల సంఘాలలో ప్రధాన పదవులు చేపట్టి వన్నెకెక్కారు, తండ్రి బాటలోనే తనయడు నడచుకుంటూ తండ్రి కంటే మిన్నగా ప్రపంచ స్థాయి ఐదు అవార్డులు అందుకున్నారు. ఇన్ని సేవాకార్యక్రమాలు ఆరంభసూరత్వంగా మొదలు పెట్టివదిలేయలేదు

.2003సం.. ఇప్పటికి 17సం గా చేస్తున్నారు కనుకనే , ముఖ్యమంత్రి రోశయ్యగారు, మండలి బుద్ధ ప్రసాదుగారు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు. బ్రహ్మంగారి మఠం, ఈశ్వరీదేవి మఠం, పీఠాదిపతులచే సన్మానింపబడినారు. ఇంకనూ మంత్రాలయం, అచలానందాశ్రమంలో సత్కరింపబడినారు.

ఇంతమంది మహనీయుల మన్ననలు పొందారంటే ఎంతటి కృషిచేశారో చెప్పలేము దాదాపు 700 సేవాకార్యక్రమాలు చేశారు,వందలకొద్ది సన్మానాలు పొందారు 5దు ప్రపంచ అవార్డులు పొందారు. విరిసేవల వివరాలు చెప్పుకుంటూ పోతే ఒక గ్రంధం అవుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే బ్రహ్మానందాచారి గారు ఒక వ్యక్తి కాదు అదొక శక్తి “నడుస్తున్న సేవాలయం” అనుట అతిశయోక్తి కాదు. ఇటువంటి సేవాతత్పరులు ఉండబట్టే ఈ కలియుగంలో ధర్మం నిలబడింది అనవచ్చు. బడుగు బలహీనులకు ఆసరా లభిస్తోంది. దైవం మానుష రూపేణ అనుటకు నిదర్శనం నిలువెత్తు సాక్ష్యం బ్రహ్మానందాచారి గారే అని అందరూ అంగీకరిస్తారు.

మానవ సేవే మాధవ సేవగా భావించి అంకిత భావంతో నిబద్ధతగా సేవలు చేస్తున్నందువలన దాతలు సహకరిస్తున్నారు పత్రికలు ప్రశంసిస్తున్నాయి కోడై కూస్తున్నాయి.

జాతీయ అంతర్జాతీయ అవార్డులు వెతుక్కుంటూ వచ్చి బ్రహ్మానందాచారిగారిని వరిస్తున్నాయి. వారి సేవలు మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నాయి. ఇంకనూ వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుందాము. ప్రోత్సహించుదాము.

ఇన్ని సేవాకార్యక్రమాలలో తలమునకలై తిరుగుతున్నారంటే వారి శ్రీమతి మరియు కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందని తెలుస్తోంది

“కవులకు దుప్పట్లు, ఉపన్యాసకులకు చప్పట్లు మరింత స్పూర్తి నస్తాయి,అలాగే సంఘ సేవకులకు సత్కారాలు వారిని కొండంత బలాన్నిస్తాయి అనే తలంపుతో. మా “పల్నాటి సాహిత్య పీఠం ‘బ్రహ్మానందాచారిగారికి’ సేవారత్న” బిరు ప్రదానము చేయటమైనది.

మరిన్ని మేలైన సేవలు అందిస్తూ జాతీయ అంతర్జాతీయ ప్రశంసలందుకొని “స్వర్ణోత్సవ వేడుకలు” జరుపుకోవాలని కోరుకుంటున్నాము. 

ఆ.వె.ఒక్కపాలు ధర్మమొప్పుచున్నది నేడు 

ధర్మ మూర్తులైన దాత లుండ 

సంఘ సేవ జేయు సంఘాలు మనుచుండ

 నిలుచు ధర్మమెపుడు తెలుగుబిడ్డ. 

అన్నట్లు సంఘసేవాపరులవలన ధర్మం నిలబడింది నేడు. 

శుభం భూయాత్.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//oagnatch.com/4/2863274