ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి

 ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి

చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధాని చేసాడు. అక్కడ కూడా 7 వేల కోట్లతో కోర్టు, ప్రభుత్వ భవనాలు రెడీ చెయ్యడం జరిగింది. ఆ తరువాత ప్రభుత్వం మారడం రాజధాని ఒకటి కాదు 3 అని చెప్పడం తెలిసిందే. దీనిపై దర్శక నిర్మాత ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.

రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం 7 వేల కోట్లు ఖర్చు చేసి అన్ని రెడీ చేసింది. ఇంకో 3 వేల కోట్లు ఖర్చు చేస్తే అక్కడ ప్రభుత్వ సముదాయాలు సమకూరేవి. అక్కడికి కంపెనీలు కూడా వచ్చేవి.

ఎవరో చేసిన పనిని మనమెందుకు కొనసాగించాలని ప్రభుత్వం మారుతూనే ఒకటి కాదు 3 రాజధానులు అని జనాలను కన్ఫ్యూజ్ చేసి, కంపెనీలకు చుక్కలు చూపించి.. అదిగదిగో.. ఇదిగిదిగో… అంటూనే… సంవత్సరాలు గడిచిపోతున్నాయి. యువకులకు ఉపాధి లేకుండాపోతోంది.

ఇప్పటికైనా మారతారా… లేకపోతే 3 రాజధానులు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడట.

అసెంబ్లీలో బూతులు తిట్టుకోవడం ఏమిటి? ప్రజా ప్రతినిధులకు తెలియదా వారు ఏం మాట్లాడినా అందరికీ చేరుతుందని. ప్రభుత్వాలు మారుతున్నాయి గాని… ప్రజలకు మేలు జరగడం లేదు. ఇలాంటి వాళ్ళు మన ప్రజా ప్రతినిధులని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఎందుకు తెలుగు వాడిగా పుట్టామురా అనిపిస్తోంది.

తమ్మారెడ్డి ఇలా అనడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీనికి మీ కామెంట్ ఏంటి?

:: సూటిగా సుత్తి లేకుండా షార్ట్ న్యూస్ :: గమనిక : వార్తలు చదివి యాడ్స్ క్లిక్ చేయడం మరచిపోకండి. థాంక్యూ.

https://www.youtube.com/watch?v=a2xkWUS61xs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//luvaihoo.com/4/2863274