సుధాకర్ కోమాకుల హీరోగా అజ్జు మహాకాళి దర్శకత్వం లో ‘రీసెట్’

 సుధాకర్ కోమాకుల హీరోగా అజ్జు మహాకాళి దర్శకత్వం లో ‘రీసెట్’

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా ‘, ‘ నువ్వు తోపు రా’ తదితర చిత్రాలతో  కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ కోమాకుల ‘రీసెట్’ పేరుతో మరో విభిన్నమైన చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా అజ్జు మహాకాళి దర్శకునిగా పరిచయమౌతున్నారు. సుఖ స్టూడియోస్ సమర్పణలో హైలైట్ విజువల్స్, కారా బూందీ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ రోజు (నవంబర్ 12) హీరో సుధాకర్ కోమాకుల పుట్టినరోజు. ఈ సందర్బంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. దర్శకుడు అజ్జు మహాకాళి మాట్లాడుతూ- ”న్యూ యార్క్ ఫిల్మ్ అకాడమీ లో డిప్లమో ఇన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసాను. సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన ‘నువ్వు తోపు రా’ కి కథ- మాటలు అందించాను. దర్శకునిగా ఇదే నా తొలి ప్రయత్నం.  కథ నచ్చి సుధాకర్ వెంటనే ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. లాక్ డౌన్ 1.0 టైం లో జరిగే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రపంచం లాక్ డౌన్ అయినాకనే అతని ప్రపంచం ఓపెన్ అయ్యింది. ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే- వాస్తవం, కల్పితం కన్నా కిరాక్ ఉంటది. డిసెంబర్ లో చిత్రీకరణ మొదలుపెడతాం” అని తెలిపారు. 
ఈ చిత్రానికి కెమెరా : సిద్ధం మనోహర్,  సంగీతం: డెన్నిస్ నార్టన్ ,ఎడిటింగ్: నవీన్ నూలి, రచన – దర్శకత్వం: అజ్జు మహాకాళి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//zuphaims.com/afu.php?zoneid=2863274