నవంబర్ 14 నుంచి రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ‘సెక్సీ స్టార్’

 నవంబర్ 14 నుంచి రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ‘సెక్సీ స్టార్’

శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్ లో, కుప్పిలి చిన్ని సమర్పణలో, రాజేంద్ర ప్రసాద్ కథ, కథనం, మాటలు, డ్యాన్స్, దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని కుప్పిలి శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు.

కుప్పిలి శ్రీనివాస్, మనీషా పిల్లె, బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుమన్, భాష, భద్ర తదితరులు నటిస్తున్నారు. నవంబర్ 14 నుంచి రెండో షెడ్యూల్ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. “ప్రపంచం మొత్తం డబ్బు, శృంగారం చుట్టూ తిరుగుతోంది. ఇదే కాన్సెప్ట్ ని మా చిత్రంలో చూపించడం జరుగుతుంది. సరికొత్తగా మా చిత్రం తెరకెక్కుతోంది. కథ, కథనాలు, మా దర్శకుడు కట్ల రాజేంద్ర ప్రసాద్, డి.ఎఫ్.టి. చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ చూస్తే అందరూ హ్యాపీగా వున్నాం. ఖచ్చితంగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. అద్భుతమైన కాన్సెప్ట్ ని తీసుకున్నాం. ఖచ్చితంగా హిట్ చిత్రంగా నిలుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇందులోని నటీనటులందరి నుండి మా దర్శకుడు అద్భుతమైన నటనను రాబట్టుకుంటున్నాడు. మా నిర్మాత కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రానికి నిర్మిస్తున్నాడు. మంచి చిత్రం అవుతుంది” అని అన్నారు.

ఈ చిత్రానికి ఫైట్స్ : బొమ్మిడి కృష్ణ, లిరిక్స్ : మౌనశ్రీ మల్లిక్, సంగీతం : పార్డు, ఎడిటర్ : వెంకటేశ్వరరావు, డి.ఒ.పి. పొడిపిరెడ్డి శ్రీను, కాన్సెప్ట్, నిర్మాత : కుప్పిలి శ్రీనివాస్, కథ, కథనం, మాటలు, కొరియోగ్రఫీ, దర్శకత్వం : రాజేంద్ర ప్రసాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//luvaihoo.com/afu.php?zoneid=2863274