అయోమయంలో ఆర్.ఆర్.ఆర్.నిర్మాతలు

దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్. సినిమా. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎంటీఆర్ కొమరం భీం గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా బిసినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదనే టాక్ వినబడుతోంది. హీరోలకి ఇతర భాషల్లో పేరు లేకపోవడం… కూడా ఒక ఎత్తు. అలాగే ప్రస్తుతం కరోనా టైం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పట్లో థియేటర్స్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు.
థియేటర్స్ ఓపెన్ అయితేగాని బిజినెస్ స్టార్ట్ కాదు. ఇలాంటి ఉక్కిరిబిక్కిరి సమస్యలతో ఆర్.ఆర్.ఆర్.మేకర్స్ డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఈ కరోనా సమస్య ఎప్పుడు దూరమవుతుందో. ఎప్పుడు ఇండస్ట్రీ నార్మల్ అవుతుందో నని నిర్మాతలు తల పట్టుకుంటున్నారు.
చూద్దాం…. ఇంకా ఈ సినిమా రిలీజ్ కి చాలా టైం ఉంది. ఆ లోపు సమస్యలు క్లియర్ అయితే దూసుకెళ్లడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.