ప్రభుదేవా రెండో పెళ్లి అప్డేట్స్

ప్రభుదేవా పెళ్లి చేసుకుంటున్నట్లు తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇక విషయానికి వస్తే ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా డైరెక్టర్ గా నటుడిగా అన్ని రంగాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు సౌత్ ఇండియానే కాకుండా హిందీలో కూడా సల్మాన్ ఖాన్ తో వరుస చిత్రాలు తీస్తూ అక్కడ నిలదొక్కుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు.
మొదటి భార్య రమాలత్ తో వివాహం మొదటి వివాహం చేసుకుని వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రమలత్ వీరి గ్రూప్ డాన్స్ సభ్యులలో ఒకరు. ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత నయనతార తో ప్రేమలో పడి పెళ్లి పీటలవరకు వచ్చి సడెన్ గా ఆగిపోయింది.
ప్రస్తుతం తల్లిదండ్రుల బలవంతం మీద చుట్టాల అమ్మాయిని ప్రభుదేవా కి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రభుదేవా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న టు సమాచారం తెలుస్తోంది.