ప్రపంచంలోనే శయనించే శివుడు కొలువై ఉన్న ఏకైక క్షేత్రం

పరమశివుడి శయన మందిరంగా సురుటుపల్లి క్షేత్రం విరాజిల్లుతోంది. సకల శైవక్షేత్రాలలో లింగాకారం లో దర్శనమిచ్చే పరమశివుడు ఇక్కడ భారీ విగ్రహ రూపంలో పార్వతీదేవి ఒడిలో శయనించి పళ్ళికొండే శ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయంలో శివ శక్తులతో పాటు సకల దేవతా గణాలు, సప్తరుషులు, గజపతి, సుబ్రమణ్యస్వామి విగ్రహాలు ఉన్నాయి. తిరు పతి – చెనై్న జాతీయ రహదారిలోని నాగలాపురం మం డలం అరుణానది ఒడ్డున సురుటుపల్లి ఉంది. రాష్ట్రంతో పాటు తమిళనాడు నుంచి భక్తుల రద్దీ విపరీతంగా ఉం టోంది. స్థలపురాణం ప్రకారం…అమృతాన్ని పొందడా నికి దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మధనం చేస్తుండగా హాలాహలం వెలువడింది.
దీంతో భీతిల్లిన దేవతలు, రాక్షసులు త్రినేత్రుని శరణు కోరగా శివుడు హాలాన్ని నేరుడు పండు రూపంలో తీసుకొని మింగేందు కు ఉపక్రమిస్తుండగా హాలాహలం వల్ల అపాయం కలు గుతుందని భావించిన పార్వతీదేవి కంఠాన్ని గట్టిగా నొక్కిపట్టడంతో హాలాహలం కంఠం వద్దనే నిలిచిపోయింది. దీంతో కంఠం నీలంగా మారుతుంది. అందువల్లే శివునికి నీల కంఠుడని పేరు వచ్చింది.