మీ ఫోను లో 4G ఇంటర్నెట్ స్పీడ్ పెంచాలంటే ఇలా చేయండి

 మీ ఫోను లో 4G ఇంటర్నెట్ స్పీడ్ పెంచాలంటే ఇలా చేయండి

ప్రపంచం అంతా 5జి వైపు చూస్తూ ఉంటే ప్రస్తుతం మనం 4G స్పీడ్ కూడా అందుకోలేక ఇబ్బంది పడుతున్నాము. జియో ఎయిర్టెల్ విస్తరణ తర్వాత యూజర్స్ అమాంతం పెరిగి పోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనికితోడు ఇప్పటికీ 4G నెట్వర్క్ పేరు వేసుకుని 4G సర్వీస్ లేని కంపెనీలు ఉన్నాయి మనకు ఫోర్ జి నెట్వర్క్ ఉన్నప్పటికీ 4g నెట్వర్క్ స్పీడ్ మాత్రం అందుకోలేక పోతున్నాము.దాని స్టోరీ ఎలా ఉంటే మనం ఈ క్రింది సెట్టింగ్స్ ద్వారా ఫోర్ జి నెట్వర్క్ స్పీడ్ కొంచెం మెరుగుపరుచుకోవచ్చు.
1. మీ మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి మొబైల్ నెట్వర్క్ లో 4G ని ఎంచుకుని ఎనేబుల్ చెయ్యండి

2. మీ ఫోన్లో APN ని తనిఖీ చేసి తగిన సమాచారాన్ని సెలెక్ట్ చేసుకోండి.

3.మీ ఫోన్లో APN ను రీసెట్ చేయండి సెట్టింగ్ – మొబైల్ నెట్వర్క్- యాక్సెస్ పాయింట్ క్లిక్ చేసి  APN డిఫాల్ట్ క్లిక్ చేయండి.

4. ఇలా చేస్తే కొంచెం మెరుగు అవ్వచ్చు ఇలా చేసినా కూడా జనరల్ గా ఉంటే మీ ఫోన్లో ఉన్నటువంటి యాంటెన్నా తక్కువ క్వాలిటీ ఉండొచ్చు.

5. 4G స్పీడ్ మీరు వాడే విధానాన్ని బట్టి కూడా స్పీడ్ తగ్గొచ్చు. కొంతమంది అనేకంగా యాప్స్ ఆన్ చేసేసి క్లోజ్ చేయకుండా, నెట్ ఆఫ్ చేయకుండా వదిలేస్తుంటారు అలా చేస్తే మీ నెట్ వాటికి కూడా షేర్ అయి, మీ నెట్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. మీరు వాడని యాప్స్ ఏమైనా ఉంటే వాటిని వెంటనే క్లోజ్ చేయడం మంచిది .

6. ఇలా పాటిస్తే కొంచెమైనా స్పీడ్ పెరిగే ఛాన్స్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//oagnatch.com/4/2863274