ప్రజల ఇష్టాలను పట్టించుకోని చైనా… ఇష్టం లేకపోయినా… బలవంతంగా…

చైనా ప్రజల ఇష్టాలతో పని లేకుండా వారి ఆరోగ్యంతో ఆడుకుంటోంది. షింజియాంగ్ లో 45 రోజుల నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. అక్కడి అధికారులు.. ఏమాత్రం వైరస్ ను అడ్డుకొని టెస్టింగ్ మందులను ఆ ప్రాంతంలో బలవంతంగా వారిచేత మింగుస్తున్నారట.
వీటిని మింగుతున్న వారికి వాంతులు, చర్మం పై పోరా ఊడిపోతుండడం లాంటి సమస్యలు వస్తున్నా కూడా అధికారులు లెక్క చేయకుండా ఈ మందులు వారికి ఇచ్చి వారి ఆరోగ్యంతో ఆటలాడుతోందని తెలుస్తోంది. వారి సాంప్రదాయ మందులను వైరస్ ని కట్టడి చేయని ప్రయోగాత్మక మందులను సైతం ప్రజల చేత బలవంతంగా మింగుస్తుండటం విషయాలను అందరూ ఆన్ లైన్ లలో షేర్ చేసుకుంటున్నారు అంటేనే పరిస్థితికి అద్దం పడుతోంది.