బెంగుళూరు లో దెబ్బకొట్టిన ప్రయోగం – షాకింగ్ ఫలితాలు

మొదట్లో దేశం మొత్తం లాక్ డౌన్ విధించడం… అయినప్పటికీ కేసులు విచ్చలవిడిగా పెరగడం.. తెలిసిందే. ఈ మధ్య బెంగుళూరు లో కేసులు ఎక్కువగా పెరుగు తుండడంతో ఆలోచించిన ప్రభుత్వం.. కేసులు తగ్గించడానికి బెంగుళూరు మహా నగరాన్ని లాక్ డౌన్ లో ఉంచింది. ఇక్కడ లాక్ డౌన్ విధించిన ముందు రోజు వరకు ఎక్కువగా అంటే 9,600 వరకు నమోదయ్యాయి. లాక్ విధించిన మొదటి రోజు ఫలితాలు మాత్రం 13,972 కేసులు నమోదయ్యాయి.
అంటే లాక్ డౌన్ లోనే ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో బెంగుళూరు నగర అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ ప్రయోగం మొత్తానికి బెడిసి కొట్టింది.
అలాగే మరణాల రేటు కూడా 2.31 నుంచి 2.45 కి పెరిగింది. దీంతో అధికారులకు ఎం చెయ్యాలో తోచటం లేదు. ఎందుకు కేసులు పెరుగుతున్నాయి…. లాక్ డౌన్ లో ఇలా ఎందుకు జరిగింది అని ఇది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది.
చూద్దాం… కేసులు అదుపులోకి వస్తాయా…? ఏమేం జరుగుతాయో… చూద్దాం…