ప్రమోషన్స్ లో సరిలేరు మహేష్ కెవ్వరు !

 ప్రమోషన్స్ లో సరిలేరు మహేష్ కెవ్వరు !

టీజర్ రాకముందు ఒక లెక్క వచ్చాక ఒక లెక్క అనిపిస్తున్నాయి ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్. అప్పటి వరకూ ప్రేక్షకుల్లో సినిమా మీదున్న అన్ని డౌట్స్ కి జస్ట్ టీజర్ తో క్లారిటీ ఇచ్చి సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసాడు సూపర్ స్టార్. ముఖ్యంగా అన్ లాక్ ది టీజర్ అంటూ ట్విట్టర్ లో మేకర్స్ చేసిన ఇన్నోవేటీవ్ ప్రమోషన్స్ నెవెర్ బిఫోర్ అనిపించి అందరినీ ఎట్రాక్ట్ చేసాయి.

విడుదలై 80 గంటలు దాటినా ఇంకా యూ ట్యూబ్ ట్రేండింగ్ లో నంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతూ భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది టీజర్. ప్రస్తుతం టీజర్ కి వచ్చిన భారీ రెస్పాన్స్, స్పీడందుకున్న ప్రమోషన్స్ తో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారని తెలుస్తుంది.

ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిందని టాక్. టీజర్ లో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ తో సంక్రాంతికి అసలు సిసలైన మాస్ సినిమా అనే ముద్ర వేసేసుకుంది సరిలేరు. ఈ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో నిలిచి సినిమా రికార్డు కలెక్షన్స్ సాధించడం ఖాయమనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//soaheeme.net/4/2863274